- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కుంభకోణంలో కేవలం లంచమే రూ.170 కోట్లు.. CM రేవంత్‌పై KTR సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో KTR మీడియాతో మాట్లాడారు. త్రీడీ మంత్రంతో కాంగ్రెస్ పాలన చేస్తోందని విమర్శించారు. మోసం, విధ్వంసం, డైవర్షన్ చేయడమే కాంగ్రెస్ విధానం అని అన్నారు. కంచ గచ్చిబౌలిలో పర్యావరణ హననం చేసిందని మండిపడ్డారు. అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందని ఆరోపించారు. రూ.10వేల కోట్ల స్కామ్‌కు కాంగ్రెస్ తెరలేపిందని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానిది నేరపూరిత కుట్ర అని కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఓ బీజేపీ ఎంపీ(BJP MP) సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రూ.170కోట్ల లంచం కూడా ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ 400 ఎకరాలు అటవీభూమిని అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదని అన్నారు. నెక్ట్స్ ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డికి సహకరించిన ఆ బీజేపీ ఎంపీ పేరు బయట పెడతా అని హాట్ కామెంట్స్ చేశారు.
అంతేకాదు.. ‘ఈ HCU భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే TGIICకి బదిలీ చేశాడు. కానీ ఇంకా మ్యుటేషన్ చేయలేదు.. రేవంత్ రెడ్డి భూముల రేట్లు మార్చి, లేని వాల్యూను ఉన్నట్లు చూపించి RBIని మిస్ లీడ్ చేసి స్కాం చేశాడు. తనది కాని భూమిని TGIICతో తాకట్టు పెట్టి, రేవంత్ రెడ్డి రూ.10000 కోట్లు తెచ్చుకొని RBI గైడ్‌లైన్స్‌ని తుంగలో తొక్కాడు’ అని కేటీఆర్ ఆరోపించారు.






