- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ తో కేటీఆర్ రహస్య స్నేహం.. బీజేపీ సంచలన ట్వీట్
కాంగ్రెస్ (Congress)తో రహస్య స్నేహాన్ని (Secret Friendship) బయటపెట్టిన కేటీఆర్ (KTR) అని తెలంగాణ బీజేపీ (Telangana BJP) ట్వీట్ (Tweet) చేసింది.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ (Congress)తో రహస్య స్నేహాన్ని (Secret Friendship) బయటపెట్టిన కేటీఆర్ (KTR) అని తెలంగాణ బీజేపీ (Telangana BJP) ట్వీట్ (Tweet) చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారబోతున్నాయి. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ తో కాళ్ల బేరానికి వచ్చిన కేటీఆర్ పొత్తు (Allience)కు సిద్ధమని బహిరంగా పిలుపు అంటూ.. గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో (KTR Video)ను ట్విట్టర్ (Twitter) పోస్ట్ (Post) చేసింది.
ఇందులో కేటీఆర్.. బీజేపీ (BJP)ని ఓడించడం రాహుల్ (Rahul) వల్ల కాదని, బీజేపీ ఒంటరిగా ఓడించలేరని అన్నారు. గెలవలేరని తెలిసి కూడా, కేసీఆర్ (KCR)తో, ఆప్ పార్టీ (AAP Party)లతో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ వాళ్లు ఒంటరిగా (Single) ఎన్నికలకు వెళతారని, దీంతో ప్రాంతీయ పార్టీలు (Regional Parties) బీజేపీ ముందు బలహీనం (Cheap) అవుతాయని చెప్పారు. దీనిపై బీజేపీ.. బరితెగించిన చీకటి మిత్రులు అని, రహస్య స్నేహాన్ని బహిరంగపరిచిన కేటీఆర్ అని, కాంగ్రెస్ తో పొత్తుకు సై అని సంచలన వ్యాఖ్యలు చేసింది.
అంతేగాక బీజేపీని ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని రాహుల్ కు హితవు పలికినట్లు తెలిపింది. ఇక కాంగ్రెస్ - బీఆర్ఎస్ (Congress- BRS) మిత్రులని (Friends) మొదటి నుండి బీజేపీ చెప్తున్నదని, నిజమేనని రుజువు చేసిన కేటీఆర్ అని ఎక్స్ లో రాసుకొచ్చింది. దీనిపై బీఆర్ఎస్ సపోర్టర్స్ (BRS Supporters) కామెంట్ల (Comments) వర్షం కురిపిస్తూ.. బీజేపీ పై విరుచుకు పడుతున్నారు. అంతేగాక కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేద్దాం.. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)ని బొంద పెడదాం అని కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కామెంట్లలో పోస్ట్ చేస్తున్నారు.






