బాల్క సుమన్‌ను వేధిస్తే ఊరుకోను.. కేటీఆర్ హెచ్చరిక

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు, పార్టీ నాయకులపై కాంగ్రెస్ నేతల రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

బాల్క సుమన్‌ను వేధిస్తే ఊరుకోను.. కేటీఆర్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు, పార్టీ నాయకులపై కాంగ్రెస్ నేతల రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నా, కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకొని వాయిదా వేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కొందరు పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా మారి, అన్యాయాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపైనే లాఠీఛార్జీకి దిగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే చెప్పారు. న్యాయం కోసం నిరసనకు దిగిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పైనే కేసులు బనాయిస్తామని బెదిరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమని అన్నారు.

అటు జనగామలోనూ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ చేయి ఎత్తిన దళిత మహిళా కౌన్సిలర్‌ పట్ల కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించడం చాలా దారుణం. పంచాయతీ ఎన్నికల నాటి నుంచి మున్సిపల్ ఎలక్షన్స్ దాకా ముఖ్యమంత్రి రేవంత్ డైరెక్షన్‌లో అడుగడుగునా అరాచక పర్వాన్ని సాగిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Next Story