KTR: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే సమాధానం కూడా వారినే అడగాలి కదా?.. నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ రిప్లయ్

by Prasad Jukanti |

బస్సు చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఓ నెటిజన్ చేసిన విజ్ఞప్తికి కేటీఆర్ స్పందించారు.

KTR: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే సమాధానం కూడా వారినే అడగాలి కదా?.. నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ రిప్లయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సమస్య వస్తే వారినే అడగాలి కదా అని ఓ నెటిజన్‍ను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) అన్నారు. తెలంగాణలో గత అక్టోబర్‍లో ఆర్టీసీ (Tgrtc Bus Fare Hike) సంస్థ బస్సు చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చార్జీల పెంపుపై ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే పెరిగిన బస్సు చార్జీల ధరలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీయాలని ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ విజ్ఞప్తి చేశారు. పటాన్‍చెరు నుంచి డీఎల్ఎఫ్ వరకు మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు చార్జీ గతంలో రూ.30 ఉంటే ఇప్పుడు రూ. 45 కు పెంచారు. ఒక్కసారిగా రూ.15 పెరగడంతో రోజూ ప్రయాణించే వారికి తీవ్ర భారం అవుతోంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. అయితే నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశానని కానీ ఇంతలా బస్సు చార్జీలు పెంచడం టూమచ్ అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ పోస్టు చేశాడు. ఈ పోస్టుపై స్పందించిన కేటీఆర్ మీరు చెప్పినట్టుగా నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం కూడా కాంగ్రెస్ పార్టీనే అడగాలి కదా?, అయినా మేము ఈ బస్సు చార్జీల పెంపుపై మా గళాన్ని విప్పుతామని చెప్పారు. ఈ పోస్టుపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. కొందరు బస్సు చార్జీల పెంపు భారీగా ఉందని విమర్శిస్తుంటే మరి కొందరు కాంగ్రెస్ కు ఓటు వేసి బీఆర్ఎస్‍ను ప్రశ్నించమనడం ఏమిటని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story