- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ దూరదృష్టికి మెడికల్ డివైసెస్ పార్క్.. నూతన కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైసెస్ పార్క్‌లో హ్యూవెల్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన కెమిస్ట్రీ ల్యాబ్‌ను కేటీఆర్ ప్రారంభించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మన దేశంలో వాడే మెడికల్ పరికరాలు (Medical equipment) 80 శాతం వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని.. అలా కాకుండా మన దగ్గరే ఎందుకు ఈ ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వంలో ఈ మెడికల్ డివైసెస్ పార్క్ ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైసెస్ పార్క్(Medical Devices Park)లో హ్యూవెల్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన కెమిస్ట్రీ ల్యాబ్‌ను కేటీఆర్ ప్రారంభించారు. మన దేశంలో ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గి, సామాన్యుడికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతోనే దీనిని ఏర్పాటు చేశామని చెప్పారు.
పార్క్ ఏర్పాటుకు ముందు సుల్తాన్‌పూర్ ఏరియాలో స్టోన్ క్రషర్లు, మెటల్ క్రషర్లు, కొంత ఖాళీ జాగా తప్ప ఏమీ లేదని గుర్తుచేశారు. కానీ.. ఇప్పుడు ఇక్కడికి వస్తే వేల మంది పని చేస్తుండడం, అనేక పరిశ్రమలు రావడం చూసి చాలా సంతోషం అనిపించింది, ఇక్కడ జరిగిన పరిశోధనలు, ప్రవేశపెట్టిన ఉత్పత్తులు చూస్తే తనకు విశ్వాసం కలిగిందని తెలిపారు. కోవిడ్ సమయంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లకు, కోవిడ్ కిట్స్‌కు విపరీతమైన గిరాకీ, డిమాండ్ ఉండేదని.. ఆ రోజుల్లో టెస్ట్ కిట్ కావాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. కానీ.. హ్యూవెల్ సంస్థకు చెందిన శిశిర్, రచన, వారి బృందం మొత్తం కలిసి అప్పట్లో రూ.6వేలు ఖర్చయ్యే ఒక టెస్ట్ ధరను కేవలం రూ.12 కు తగ్గించామని చెప్పడం అద్భుతమని కొనియాడారు. హ్యూవెల్ సంస్థకు పదో వార్షికోత్సవం సందర్భంగా బృందాన్ని అభినందించారు.






