HCU భూముల వివాదంపై KTR రియాక్షన్

by Gantepaka Srikanth |

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) విద్యార్థులు బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్‌(KTR)తో భేటీ అయ్యారు.

HCU భూముల వివాదంపై KTR రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) విద్యార్థులు బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్‌(KTR)తో భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో HCU భూముల ఇష్యూపై విద్యార్థులతో కేటీఆర్ చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం 400 ఎకరాలు అమ్మి.. రూ.30 వేల కోట్లు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నదని ఆరోపించారు. ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్ పండుగ వేళ కోర్టుకు సెలవులు అని.. అందుకే అర్ధరాత్రి మెషీన్లు, వందల సంఖ్యలో పోలీసులను పంపి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం అరాచకం చేస్తున్నదని మండిపడ్డారు. విద్యార్థులను టెర్రరిస్టులను ట్రీట్ చేసినట్లు చేసినట్లు చేస్తుంటే.. రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీలో 45 వేల ఎకరాలు ఉండగా.. ఈ 400 ఎకరాల మీద ఎందుకు అంత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనపై హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ఆఫీస్ స్పందించింది. 2024 జూలై‌లో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ భూమి ఎలా ఉందని ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని తేల్చిచెప్పారు. హద్దులు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు పేర్కొన్నది.

Next Story