- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR : హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టు(High Court)లో క్వాష్ పిటిషన్)(Quash Petition) దాఖలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టు(High Court)లో క్వాష్ పిటిషన్)(Quash Pitition) దాఖలు చేశారు. మేడిగడ్డ బ్యారేజి(Medigadda Barrage) వద్ద అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేసినందుకు కేటీఆర్ తోపాటు మరికొంతమందిపై మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్(Mahadevapur PS) లో కేసు నమోదైంది. కాగా తనపై నమోదయిన ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై నేడు విచారణ జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ పై కేసు నమోదు చేశారని, తక్షణమే కేసు కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.
అయితే 2024 జూలై 26న ముందస్తు అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజీని కేటీఆర్.. అతని అనుచరులు సందర్శించారని, అనుమతి లేకుండా డ్రోన్ కూడా ఎగురవేశారని కేసు నమోదు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు. మేడిగడ్డ ప్రాజెక్టు తెలంగాణకు ఎంతో కీలకమని, ప్రాజెక్టు నిషేధిత జాబితాలో ఉండటం వలన.. అక్కడికి ఎవరికీ అనుమతి లేదన్నారు. పర్మిషన్ లేకుండా తన అనుచరులతో ప్రాజెక్టు వద్దకు వెళ్లడమే కాకుండా డ్రోన్ కూడా కూడా ఎగురవేశారని.. వీరిలాగే రేపు మరొకరు డ్రోన్ ఎగురవేసే అవకాశం ఉందని.. ఫలితంగా ఇది డ్యామ్ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పీపీ కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్ట్ తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.






