- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి.. కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి.. ఆటోమేటిక్‌గా అన్ని రేట్లూ తగ్గుతాయి

దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం(GST Council Meeting) నేపథ్యంలో కేంద్రానికి కేటీఆర్(KTR) బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ శ్లాబ్ రద్దు.. మార్పు అంటూ కేంద్రం ప్రచారం చేసుకుంటోంది. ధరల తగ్గింపుపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే.. పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే.. అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని లేఖలో పేర్కొన్నారు. చేనేతపై, ఔషధాలపై, విద్య సంబంధిత ఫీజులపై జీఎస్టీని తొలగించాలని చెప్పారు. తెలంగాణలో చేనేతల సంక్షేమానికి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. కానీ, మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 5శాతం జీఎస్టీ విధించిందని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా పన్నును 12 శాతం పెంచాలని ఆ తరువాత నిర్ణయించిందని గుర్తుచేశారు. ఆ సమయంలో దేశంలో అందరి కంటే ముందే తాము కేంద్రం నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రధానికి బహిరంగ లేఖ రాశామని అన్నారు. వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి జీవనాధారంగా ఉన్న చేనేత రంగంపై పూర్తిగా పన్నును ఎత్తివేయాల్సింది పోయి పెంచుతారా అని ప్రశ్నించారు. చేనేత అనేది కేవలం వస్త్ర తయారీ రంగం మాత్రమే కాదు అది మన సాంస్కృతిక వారసత్వం. దానిపై పన్ను వేయడం అంటే మన సంస్కృతిని అవమానించడమే అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.






