- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాక్షాత్తు రేవంత్ రెడ్డే ఒప్పేసుకున్నాడు: కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలంతా తలో చెయ్యి వేసి ఒక వెయ్యి కోట్లు పోగు చేసి రాహుల్ గాంధీ కుటుంబానికి ఇచ్చే సామర్థ్యం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలంతా తలో చెయ్యి వేసి ఒక వెయ్యి కోట్లు పోగు చేసి రాహుల్ గాంధీ కుటుంబానికి ఇచ్చే సామర్థ్యం ఉందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక ట్వీట్ పెట్టారు.
‘రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాగా మారింది అని మేమెన్నో సార్లు చెప్పిన విషయం ఇప్పుడు సాక్షాత్తూ రేవంత్ రెడ్డే నిస్సిగ్గుగా ఒప్పుకున్నాడు. రైతన్నలకు, మహిళలకు, యువతకు, అవ్వాతాతలకు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఇచ్చిన 420 హామీల అమలుకేమో రూపాయి లేదంటాడు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను, లగచర్లలో గిరిజనుల భూమిని, హెచ్‌సీయూ విశ్వవిద్యాలయ భూమిని, హిల్ట్ పాలసీ పేరిట పరిశ్రమల భూమిని, అనుముల బ్రదర్స్ కలిసి ఆంబుక్క పడుతున్నారు. రెండేళ్లలోనే మూడు లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదీ సర్కారు. చేస్తున్నదల్లా దండుపాళ్యం ముఠాలాగా తెలంగాణను దోచుకోవడం, స్వంతానికి దాచుకోవడం. పదవిని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి సంచులు మోయడం’ అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.






