KTR: జూబ్లీహిల్స్‌ బైపోల్‌ను ఈజీగా తీసుకోవద్దు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

KTR: జూబ్లీహిల్స్‌ బైపోల్‌ను ఈజీగా తీసుకోవద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎవరూ ఈజీగా తీసుకోవద్దు అని అన్నారు. అనుకోకుండా వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి తీరాలి అని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్లాస్, మాస్ అందరూ ఉంటారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క హైదరాబాద్‌లో లక్షమంది పేదలకు జీవో 58, 59 కింద పట్టాలు ఇచ్చామని గుర్తుచేశారు. అందుకే హైదరాబాద్‌ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ వైపు నిలబడ్డారు. కాంగ్రెస్‌కు గ్రేటర్‌లో ఒక్క సీటు కూడా రాకపోవడానికి కేసీఆర్‌ చేసిన అభివృద్ధే కారణమని అన్నారు. పేదవారికి మాత్రమే హైడ్రా నిబంధనలు వర్తిస్తాయా? అని సర్కార్‌పై సీరియస్ అయ్యారు. తెలంగాణలో ఏనాడూ కులం, మతం పేరు చెప్పి కేసీఆర్ రాజకీయం చేయలేదు అని అన్నారు.

Next Story