బీఆర్ఎస్‌లోనే ఉన్నానన్న ఎమ్మెల్యే సభకు ఎందుకు రాలేదు?.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్‌లోనే ఉన్నానన్న ఎమ్మెల్యే సభకు ఎందుకు రాలేదు?.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. గద్వాలను అభివృద్ధి చేసింది కేసీఆరే(KCR) అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి పాలమూరు పచ్చగా మారిందని తెలిపారు. ‘కాంగ్రెస్‌లో చేరబోనని ప్రస్తుత గద్వాల ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్‌లో చేరాల్సిన పరిస్థితే వస్తే తల రైలు కింద పెడతానని కూడా కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీతో కలిసి పనిచేస్తున్నారో అందరికీ తెలుసు. ప్రజల నుంచి కోర్టుల నుంచి మొట్టికాయలు వస్తుండటంతో ఇప్పుడు బీఆర్ఎస్‌లోనే ఉన్నానని మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్‌లోనే ఉండి ఉంటే.. ఇప్పుడు ఈ సభకు ఎందుకు రాలేదు. ఏది చెబితే అది నమ్మడానికి ప్రజలేం అమాయకులు కాదు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో తప్పకుండా గద్వాలలో ఉప ఎన్నిక రావడం ఖాయం. ఇక్కడ బీఆర్ఎస్ మళ్లీ గెలవడం ఖాయం. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదు’ అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story