- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ తలుచుకుంటే ఆ పని ఎంతసేపు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మెట్రో విస్తరణ(Metro Expansion)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మెట్రో విస్తరణ(Metro Expansion)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దశల వారీగా మెట్రో విస్తరణకు గతంలో కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ మెట్రోకు మంచి డిమాండ్ ఉండేదని అన్నారు. తాము దిగిపోయే నాటికి హైదరాదాబాద్ మెట్రో దేశంలో రెండో అతిపెద్ద వ్యవస్థ అని చెప్పారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీఎం కాగానే ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే మెట్రోను రద్దు చేశారని అన్నారు. నిర్మాణ పనులు చేపట్టి ఉంటే ఇప్పటికే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది అని చెప్పారు. కేటీఆర్ భూములు ఉన్నాయని ఆ ప్రాజెక్టును రద్దు చేశారని ప్రచారం జరిగింది. అప్పటినుంచే ఎల్ అండ్ టీకి ప్రభుత్వానికి మధ్య పంచాయతీ మొదలైందని అన్నారు. ఎల్ అండ్ టీ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్‌కు ఇది మాయని మచ్చ అని చెప్పారు. ఎల్ అండ్ టీ సీఎఫ్‌వోను జైలులో వేయాలని రేవంత్ రెడ్డి చెప్పడం దారుణమైన విషయమని అన్నారు. పెట్టుబడిదారులను బెదిరించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారని గుర్తుచేశారు.






