- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర రాజధానిలో పాలన పడకేసిందని.. స్వచ్ఛ నగరానికి కాంగ్రెస్ తెగులు పట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజధానిలో పాలన పడకేసిందని.. స్వచ్ఛ నగరానికి కాంగ్రెస్ తెగులు పట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. హోం శాఖ, విద్యాశాఖ, పురపాలకశాఖ, నీటిపారుదలశాఖ, వైద్య శాఖ, వ్యవసాయశాఖ ఇలా అన్నింటా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని తెలిపారు. అందాల పోటీలతో నగరానికి అందం రాదని.. నగరం అందంగా ఉంటేనే రాష్ట్రానికి శోభ వస్తుందని అని పేర్కొన్నారు. గురుకులాల్లో విద్యార్థులకే కాకుండా మానసిక రోగులకూ కలుషిత ఆహారమే అందిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు కళాశాలల్లో పుస్తకాలు జాడలేవని.. నెలన్నర దాటితే గానీ విద్యార్థులకు పుస్తకాలు అందే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలన వైఫల్యం తెలంగాణ ప్రగతికి శాపంలా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిస్తే.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు.






