జూబ్లీహిల్స్‌లో ఓటుకు రూ.10 వేలు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) నేపథ్యంలో బీఆర్‌ఎస్‌(BRS) ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్(KTR) సమావేశం అయ్యారు.

జూబ్లీహిల్స్‌లో ఓటుకు రూ.10 వేలు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) నేపథ్యంలో బీఆర్‌ఎస్‌(BRS) ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్(KTR) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. వారికి కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బుద్ధి చెప్పితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తదని అన్నారు. రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్‌లో ఖర్చుపెడతారని కీలక వ్యాఖ్యలు చేశారు. బైపోల్‌లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ.10వేలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని అన్నారు.

ఇక బీజేపీ రాష్ట్రానికి పనికిరాని పార్టీని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లే అని అన్నారు. హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలి అంటే కేసీఆర్ తిరిగి రావాలని.. అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాలని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు రూ.4 వేల పెన్షన్లు వస్తాయని అన్నారు. ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు, కానీ రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయల అప్పుల్ని మాత్రం చేసిందని అన్నారు. గరీబోళ్ల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి, హైదరాబాద్‌లో ఇళ్లు కూలగొడుతున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని అన్నారు. కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేవీ చూడకుండా పేదవాళ్ళ ఇండ్లపైకి బుల్డోజర్లను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నదని అన్నారు.

అన్నీ తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు. పార్లమెంట్‌లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని తెలుసు. ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేస్తుందని కూడా తెలిసి మరీ బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడి మోసం చేశారని మండిపడ్డారు.

Next Story