- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బజార్‌లోకి లాక్కొచ్చి నిలదీస్తాం’.. ఎర్రగడ్డలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం ఎర్రగడ్డలో నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం ఎర్రగడ్డలో నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈనెల 14 తర్వాత రాష్ట్రంలో తుపాను రాబోతోంది.. ఎవరెవరు ఎగురుతున్నారో.. వాళ్ల తోకలు కత్తిరిస్తాం.. ఆకు రౌడీలను రేవంత్ రెడ్డి కూడా కాపాడలేడు.. చరిత్రలో హిట్లర్ వంటి నియంతలే పతనమైపోయారు.. రేవంత్ రెడ్డి ఎంత’’ అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పదేళ్లలో కేసీఆర్ ప్రజలను ఎలా చూసుకున్నారో అందరికీ తెలుసు.. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మితో రూ.లక్ష ఇచ్చారు.. మగబిడ్డ పుడితే రూ.12 వేలు.. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు అందించారు.. లక్షా 50 వేల పట్టాలు అందించిన ఘనత కేసీఆర్‌దే. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించిన ఘనత కేసీఆర్‌దే.. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు అందరినీ బాగా చూసుకున్నారు.. లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పెరిగాయి. యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయి.. పదేళ్లు రియల్ ఎస్టేట్ బాగుండే.. హోటళ్లు బాగా నడిచాయి.. ఇప్పుడు అన్నీ నాశనం అయ్యాయి.. కాంగ్రెస్ నేతలు ఎన్ని అబద్ధాలు చెప్పారో అందరికీ తెలుసు.. రూ.4వేలు పెన్షన్ ఇస్తామన్నారు.. రూ.2500 మహిళలకు ఇస్తామన్నారు.. తులం బంగారం ఇస్తామన్నారు.. కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదు..
జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్‌ను ఆదరించి.. మాగంటి సునీతను గెలిపిస్తే.. పథకాలు ఎందుకు ఇవ్వవు అని బజార్‌లో గుంజి నిలదీస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.






