ఇంకెన్ని రోజులు రేవంత్ సీఎంగా ఉంటారో మూడ్రోజుల్లో తెలుస్తుంది: కేటీఆర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-09 12:27:32  IST  )

యూసుఫ్‌గూడ రోడ్‌ షోలో‌ కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకెన్ని రోజులు రేవంత్ సీఎంగా ఉంటారో మూడ్రోజుల్లో తెలుస్తుంది: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: యూసుఫ్‌గూడ రోడ్‌ షోలో‌ కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. కత్తి వాళ్లకు ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా అని ప్రజలను అడిగారు. కత్తి మాకిస్తే బుల్డోజర్‌కు అడ్డు వెళ్లి ఆపడానికి కూడా వెనుకాడం అని అన్నారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతను గెలిపిస్తే.. కేసీఆర్ మళ్లీ వస్తాడు.. సరిగ్గా 500 రోజుల్లో మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది.. కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. మరో మూడేళ్లు అధికారంలో ఉంటామని రేవంత్ రెడ్డి అంటున్నారు.. జూబ్లీహిల్స్‌లో సునీత గెలిస్తే.. సీఎంగా రేవంత్ రెడ్డి మూడేళ్లు ఉంటారో.. మూడు నెలలే ఉంటారో తెలుస్తుందని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఢిల్లీలో ఖమ్మం, నల్లగొండ నేతలు కత్తులు నూరుతున్నారని అన్నారు. ఎల్లుండి ఎన్నికల్లో ఆ కుర్చీని మడత పెట్టాలని ఓటర్లను కోరారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని అన్నారు. ఓటమి భయంతోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. మళ్లీ ఒకసారి బీఆర్ఎస్‌కు అవకాశం ఇవ్వండి.. మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అని జూబ్లీహిల్స్‌ ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

READ MORE .....

సినీ కార్మికులకు కేటీఆర్ కీలక విజ్ఞప్తి

Next Story