‘అవి ఉరితాడులా చుట్టుకుంటాయి జాగ్రత్త’.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌‌లోని షేక్‌పేట్‌లో కేటీఆర్‌(KTR) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

‘అవి ఉరితాడులా చుట్టుకుంటాయి జాగ్రత్త’.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌‌లోని షేక్‌పేట్‌లో కేటీఆర్‌(KTR) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్(BRS) గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. మాయమాటలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌(KCR) చావునోట్లో తలపెట్టి రాష్ట్రం తెచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్‌ వచ్చాకే రాష్ట్రంలో కరెంట్‌ సమస్య పరిష్కారమైంది.. హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు నిర్మించినట్లు చెప్పారు. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ పథకాలను కొనసాగించే తెలివి వీళ్లకు లేదని సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌లు కట్టించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ వచ్చాక ఒక్క ఇళ్లైనా నిర్మించార? అని ప్రశ్నించారు. ఇళ్లను కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? అని అడిగారు. పేదల ఇళ్లను హైడ్రా కూల్చివేసిందని మండిపడ్డారు. పేదల శాపాలు కాంగ్రెస్‌కు ఉరితాడులా చుట్టుకుంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని నాశనం చేశారని అన్నారు. తెలంగాణ నుంచి పరిశ్రమలు పారిపోతున్నాయని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

Next Story