- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డి ట్రాప్‌లో పడకండి.. కేటీఆర్ పిలుపు
కేవలం ప్రభుత్వ వైఫల్యాలను.. హామీల అమలును కపిపుచ్చుకోవడానికి కీలకమైన మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్‌రెడ్డి తిట్ల దండకం అందుకున్నారని, ఆయన తిట్ల ట్రాప్‌లో పడొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సమాజానికి, కార్యకర్తలకు ‘ఎక్స్’లో పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేవలం ప్రభుత్వ వైఫల్యాలను.. హామీల అమలును కపిపుచ్చుకోవడానికి కీలకమైన మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్‌రెడ్డి తిట్ల దండకం అందుకున్నారని, ఆయన తిట్ల ట్రాప్‌లో పడొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సమాజానికి, కార్యకర్తలకు ‘ఎక్స్’లో పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డపై ప్రస్తుతం ఒక వికృతమైన రాజకీయ క్రీడ నడుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో, ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని, ఒక తండ్రిలా ఈ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకుని, పడావు పడ్డ తెలంగాణను ప్రగతి బాటలో నడిపించిన మహోన్నత శిల్పి అని కొనియాడారు.
కేసీఆర్ ఎప్పుడూ బిరుదుల కోసం, సన్మానాల కోసం పాకులాడలేదని.. ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే ఆయనకు నిజమైన సత్కారమని స్పష్టం చేశారు. అధికార గర్వంతో రేవంత్ రెడ్డి కేసీఆర్ వ్యక్తిత్వం మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద జరుగుతున్న దాడి కాదని, తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద జరుగుతున్న దాడి అని పేర్కొన్నారు. రేవంత్ పన్నుతున్న తిట్ల ట్రాప్‌లో పార్టీ శ్రేణులు ఎవరూ పడకూడదని సూచించారు. వార్డుల్లోని మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికీ అందాల్సిన పథకాల మీదనే చర్చ పెట్టాలని.. రేవంత్ తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల కన్నీటిని తుడిచే దిశగా పోరాటం సాగాలని, అబద్ధపు ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.






