- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటమిపై కేటీఆర్ రియలైజ్.. పార్టీ శ్రేణులకు కీలక పిలుపు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్(BRS) శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్(BRS) శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. పదేళ్ల పాటు మన నాయకుడు కేసీఆర్(KCR) బాగా పనిచేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కాని అనే పనులు చేసి చూపించారు. రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ స్టేట్‌గా నిలిపారు. అయినా ఓడిపోయామంటే అందుకు మనమే అని అన్నారు. మన నాయకుడు బాగా పనిచేశారని మనమే ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం అయ్యామని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పార్టీ ఓటమిపై మన అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ గెలవడానికి కారణాలు ఏంటి?, మనం ఓడిపోవడానికి కారణాలు ఏంటి? అనే దానిపై అందరూ ఆరా తీయాలని అన్నారు. ఓటమిలో మన అధినాయకుడి తప్పు ఏమాత్రం లేదు.. నాయకులుగా మనమే విఫలం అయ్యామని చెప్పారు. అలవికానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులు ఎత్తేసింది.. దీన్ని మనం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సూచించారు.






