సినీ కార్మికులకు కేటీఆర్ కీలక విజ్ఞప్తి

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-09 12:26:37  IST  )

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) ప్రచారంలో భాగంగా ఆదివారం యూసఫ్‌గూడ‌లో కేటీఆర్(KTR) రోడ్ షో నిర్వహించారు.

సినీ కార్మికులకు కేటీఆర్ కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) ప్రచారంలో భాగంగా ఆదివారం యూసఫ్‌గూడ‌లో కేటీఆర్(KTR) రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు వేసే ముందు గుండె మీద చేయి వేసుకొని ఆలోచించి ఓటు వేయండి.. కేసీఆర్ అంద‌రినీ క‌డుపులో పెట్టుకొని చూసుకున్నారు.. అన్ని రంగాల్లో తెలంగాణ‌ను అభివృద్ధి చేశారు.. బ‌స్తీ ద‌వాఖానా, 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు ఉచిత నీళ్లు, క‌రెంటు క‌ష్టాలు లేకుండా చూసుకున్నారు.. హైద‌రాబాద్‌లో 42 ఫ్లైఓవ‌ర్లు, కొత్త లింక్ రోడ్లు వేశారు.. అభివృద్ధి, సంక్షేమం రెండింటికి స‌మ ప్రాధాన్య‌త ఇచ్చారు.. రాష్ట్రాన్ని, రియల్ రంగాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు.. మళ్లీ అలాంటి రోజులు రావాలన్నా.. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నా.. అది జూబ్లీహిల్స్ నుంచి ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పెట్టుబ‌డులు హ‌ర‌తి క‌ర్పూరంలా క‌రిగిపోతున్నాయని ఆవేదన చెందారు. ఎన్ని అబ‌ద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిందో గుర్తుతెచ్చుకోవాలని కోరారు. ఆరు గ్యారంటీలు, తులం బంగారం, రూ.4 వేల పెన్షన్, మహిళలకు రూ.2500, ఆడబిడ్డలకు స్కూటీలు.. ఇలా ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చారని విమర్శించారు. ఇందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పారు. ఎన్నికలకు ముందు సినిమా వాళ్ల‌ను జైల్లో పెడ‌తారు.. ఎన్నిక‌లు వ‌స్తే బ‌ల‌వంతంగా సినిమా వాళ్ల‌తో స‌న్మానం చేయించుకున్నారని విమర్శించారు. త్వరలోనే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది.. సినీ కార్మికులు అందరినీ కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. దయచేసి జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

READ MORE .....

ఇంకెన్ని రోజులు రేవంత్ సీఎంగా ఉంటారో మూడ్రోజుల్లో తెలుస్తుంది: కేటీఆర్

Next Story