- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: 12 మంది పిల్లలు.. 5 పందులు! కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణలో విద్యారంగంపై కొనసాగుతున్న నేరపూరిత నిర్లక్ష్యానికి అద్దం పట్టే చిత్రం ఇది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ఫోటోను షేర్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో విద్యారంగంపై కొనసాగుతున్న నేరపూరిత నిర్లక్ష్యానికి అద్దం పట్టే చిత్రం ఇది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ మేరకు 12 మంది పిల్లలు. 5 పందులు అంటూ కేటీఆర్ మంగళవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఒక ఫోటోను నెటిజన్‌లతో పంచుకున్నారు. తెలంగాణలో విద్యారంగంపై కొనసాగుతున్న నేరపూరిత నిర్లక్ష్యానికి అద్దం పట్టే చిత్రం ఇదని తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో పూర్వప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అంగన్‌వాడీలో పందులు తిరుగాడుతుంటే, బిక్కుబిక్కుమంటూ భోజనం కోసం విద్యార్థులు లైన్లో నిలబడ్డారని పేర్కొన్నారు. కాంగ్రెస్ గద్దెనెక్కాక రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో 102 ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరిగి 2188 పిల్లలు ఆస్పత్రుల పాలయ్యారని పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల 118 మంది ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని ట్వీట్‌లో పేర్కొన్నారు.






