- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. మంగళవారం కేటీఆర్ ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. పువ్వాడ అజయ్ లాంటి నాయకుడు ఓడిపోతాడని ఎవరం అనుకోలేదు.. ఆయన ఓడిపోవడం నిజంగా బాధాకరమని అన్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు కీలక నాయకులు మంత్రులుగా ఉన్నారని.. అయినా జిల్లాలో అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. వరదల సమయంలో ముగ్గురు మంత్రులతో ఒక్కపైసా ఉపయోగం కూడా లేదని ఎద్దేవా చేశారు. ఒక్క కుటుంబాన్ని కూడా వరదల నుంచి కాపాడలేకపోయారని అన్నారు. కనీసం హెలికాఫ్టర్ తెప్పించాలనే సోయి కూడా ముగ్గురిలో ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు.
కాగా, అంతకుముందు కేటీఆర్ వృక్షార్చన కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 17న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం(KCR Birthday) సందర్భంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. హరిత తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలుపోగు లాగా వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని అన్నారు. అదే కేసీఆర్‌కు మనం ఇచ్చే పుట్టిన రోజు కానుక అని తెలిపారు. ఈ వృక్షార్చన కార్యక్రమం తీసుకున్న పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్(Santosh Kumar)ను కేటీఆర్ అభినందించారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ఆఫీస్ సెక్రటరీ, మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, బీగాల గణేశ్, శంకర్ నాయక్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు.






