- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్న చిన్న గొడవలు ఉంటే సర్దుకుపోవాలి.. కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ పరోక్ష స్పందన
శాసనమండలిలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై కల్వకుంట్ల కవిత కీలక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: శాసనమండలిలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) కీలక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కవిత వ్యాఖ్యలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పరోక్షంగా స్పందించారు. మంగళవారం జనగామలో కేటీఆర్ పర్యటించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఏ కుటుంబంలో అయినా గొడవలు ఉండటం సహజం. ఇప్పుడు పరిస్థితుల్లో అయితే సర్వసాధారణం. గొడవలు జరిగినప్పుడు అలుగుడు, గులుగుడు ఉంటాయి.. సర్దుకుపోవాలి.. లేదంటే కాంగ్రెస్ నేతలకు సందు దొరుకుద్ది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
చలిలో ఎదురుచూపు
అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ముఖ్యమంత్రికి ఏం తెల్వదు.. మూటలు మోసుడు తప్ప ఏం తెల్వదు. నీళ్ల గురించి, ప్రాజెక్టుల గురించి కేసీఆర్‌కే పాఠాలు చెబుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయిపోయింది. ప్రజలను నిండా ముంచాడు. రైతుల పరిస్థితులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. యూరియా కోసం చలిలో ఎదురు చూస్తున్నారు. ఎనకటి రోజులు తెస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు, అదే రాబందు కాలం రేవంత్ రెడ్డి తెచ్చి చూపించాడు. గ్రామాల్లో రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిడుతున్నారు. వీటిని డైవర్ట్ చేసేందుకు తిరిగి కేసీఆర్‌ను తిడుతున్నారు.
అగ్రస్థానంలో నిలిపినందుకా?
ఇంటింటికీ నీళ్లు ఇచ్చినందుకు, ఆసరా పెన్షన్లు పెంచి ఇచ్చినందుకు, రైతుబంధు ఇచ్చినందుకు, రైతుబీమా ఇచ్చినందుకు, సాగునీటి ప్రాజెక్టులు కట్టి దేశంలోనే పంటల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపినందుకు, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందుకు కేసీఆర్‌ని అలా అంటున్నాడా అనేది తెలియడం లేదు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టే ముఖం లేని రేవంత్ రెడ్డి, ఆడబిడ్డలకు నెలకు 2500 ఇవ్వలేని రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటున్నాడు. ఇప్పటికైనా కాంగ్రెస్ మోసాలను పసిగట్టండి’ అని ప్రజలను కేటీఆర్ కోరారు.






