KTR : హైడ్రాపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హైడ్రా(HYDRAA)పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

KTR : హైడ్రాపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హైడ్రా(HYDRAA)పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల ఇళ్ళు, బడాబాబుల ఇళ్ళు చెరువుల ఒడ్డున బఫర్ జోన్లో FTL పరిధిలో ఉంటే హైడ్రాకు కనబడటం లేదా అని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం HYDRAA ద్వారా చెరువుల బఫర్ జోన్‌లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ, నిరుపేదల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటూ హైకోర్టు స్టే ఆర్డర్లను ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కొడంగల్లో రెడ్డికుంటలో, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి దుర్గం చెరువు FTLలో, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హిమాయత్ సాగర్‌లో, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్, కేవీపీ వంటి పెద్దలు బఫర్ జోన్‌లో గెస్ట్ హౌస్‌లు, పెద్ద బిల్డర్లు మూసీ నదిలో అపార్ట్‌మెంట్లు నిర్మించుకుంటే హైడ్రాకు గాని, ముఖ్యమంత్రి కంటికి ఇవి కనబడకపోవడం శోచనీయం అన్నారు.

కాని నిరుపేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు తమ ఇళ్లు కూల్చొద్దని, హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తి నోరు మొత్తుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story