KTR: అహ! నా పెళ్లంట సినిమా గుర్తుందా..?

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-01 12:27:54  IST  )

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు.

KTR: అహ! నా పెళ్లంట సినిమా గుర్తుందా..?
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అహ! నా పెళ్లంట సినిమా(Aha Naa Pellanta Movie) తరహాలో పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. కోడిని వేలాడదీసి పచ్చడి మెతుకులు పెడతున్నారని ఎద్దేవా చేశారు. తులం బంగారం అని.. గ్యారెంటీ కార్డులు ఇచ్చి అరచేతిలో స్వర్గం చూపించారు. గ్యారెంటీ కార్డులు ఇంటింటికి పంచి ఆగమాగం చేశారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఎన్నికలు వస్తే ఎవరైనా ఏం చేస్తారో చెప్తారు.. కానీ బెదిరిస్తారా? అని జూబ్లీహిల్స్‌ ప్రజలను కేటీఆర్ అడిగారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం ఆపేస్తామని సీఎం బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. రేవంత్‌ రెడ్డికి పదవి ఇచ్చిందే ప్రజలు.. అది మర్చిపోయి రాజులా ఫీలవుతున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌ తోక కత్తరించేందుకు రెడీగా ఉన్నారు.. ఇచ్చిన ఒక్క హామీని ప్రజలు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రజల సొమ్ముకు ధర్మ కర్త అంతే.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Next Story