KTR: ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపాలి

by Gantepaka Srikanth |

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘ఎక్స్’లో విమర్శించారు.

KTR: ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘ఎక్స్’లో విమర్శించారు. సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అట్టడుగున ఉండటం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన మరో స్పష్టమైన సూచిక ఇదేనని తెలిపారు. సరిగ్గా రెండేళ్ల క్రితం, కేసీఆర్ పాలనలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో వ్యవసాయం నుండి ఐటీ వరకూ అన్ని రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి దన్ను ఇవ్వడంతో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసి, రికార్డులు తిరగరాసిందని తెలిపారు. కానీ.. నేడు కాంగ్రెస్ పాలనలో పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా అన్ని రంగాలూ నేలచూపులే చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం నుంచి రియల్ ఎస్టేట్ వరకూ అన్ని రంగాల్లోనూ దైన్యమే తాండవిస్తున్నదని మండిపడ్డారు. అరాచకత్వం, అవినీతి, అనుభవలేమి కలగలసిన రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురవుతున్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story