- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ చేతగానితనం వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి.. కేటీఆర్ ఫైర్
తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం నందినగర్‌లోని నివాసం వద్ద కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. ఎరువుల బస్తాల కోసం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత పదేళ్ల కేసీఆర్(KCR) పాలనలో ఏనాడూ ఈ దుస్థితి రాలేదని అన్నారు. కేసీఆర్ పాలనలో ఎరువులు బఫర్ స్టాక్ పెట్టేవాళ్లమని గుర్తుచేశారు. రెండు నెలలుగా తెలంగాణలో దయనీయమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదని.. చిల్లర రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసని సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. పదేళ్లు ఏ కష్టం తెలియకుండా రైతులను కేసీఆర్ కాపాడుకున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు మళ్లీ కష్టాలు కూడా రైతులకు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఒక్క సమీక్ష కూడా చేయలేదు అంటే రైతులపై, వ్యవసాయ శాఖపై వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అందరూ అర్థం చేసుకోవాలని కోరారు.
Also Read..
KTR: మా మద్దతు వాళ్లకే.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మద్దతుపై తేల్చేసిన కేటీఆర్






