- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందులో డీజిల్ పోసే దిక్కు కూడా లేదు.. ప్రభుత్వంపై KTR సీరియస్
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు సమస్యలతో సతమతమవుతున్నాయి. పంచాయతీల్లో పాలకవర్గాల గడువు ముగిసి ఫిబ్రవరి 2కి ఏడాదైంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు సమస్యలతో సతమతమవుతున్నాయి. పంచాయతీల్లో పాలకవర్గాల గడువు ముగిసి ఫిబ్రవరి 2కి ఏడాదైంది. ఎన్నికలు నిర్వహించక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రావట్లేదు. దీంతో పల్లెల్లో పాలన పడకేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వీధి దీపాల మరమ్మతులకు కూడా నిధులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. పాలకవర్గాలుంటే చిన్నచిన్న పనులకు సర్పంచులే తొలుత ఖర్చు చేసి అనంతరం ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకునేవారు. ప్రస్తుతం నిర్వహణ భారమంతా కార్యదర్శులపై పడటంతో పాలన పడకేసినట్లు తెలుస్తోంది. తాజాగా.. ఈ సమస్యలపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
రాష్ట్ర సచివాలయంలోనే కాదు.. చివరికి గ్రామ సచివాలయా(Village Secretariat)ల్లో కూడా పాలన పడకేసిందని విమర్శించారు. గాడితప్పిన పంచాయతీల్లో పరిపాలన సాగేదెట్లా..?, సమస్యల సుడిగుండంలో ఉన్న ప్రజల కష్టాలు తీరేదెట్లా..? అని ప్రశ్నించారు. పడకేసిన పారిశుధ్యంతో ప్రజలు రోగాలపాలు అవుతున్నారని అన్నారు. వీధి దీపాలు వెలగక పల్లెసీమలు చిమ్మ చీకట్లో మగ్గుతున్నాయని ఆవేదన చెందారు. దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయడానికి పైసల్లేవు.. పంచాయతీ ట్రాక్టర్‌కు డీజిల్ పోసే దిక్కు లేదని మండిపడ్డారు. ఇదేనా ప్రజాపాలనా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ప్రత్యేకాధికారుల పాలనకు ఏడాదైనా కళ్లుతెరవరా..? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో రుపురేఖలు మారాయని గుర్తుచేశారు. నాడు పంచాయతీలకు ఠంచన్‌గా కడుపునిండా నిధులు వచ్చేవని అన్నారు. కాంగ్రెస్ వచ్చింది.. మళ్లీ పల్లె ప్రజలకు పాత కష్టాలు తెచ్చిందని సెటైర్ వేశారు. నిన్నటి దాకా పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచ్‌లు అప్పులపాలు అయ్యారని.. నేడు జేబుల నుంచి ఖర్చుచేసిన కార్యదర్శులకు కూడా తిప్పలు తప్పట్లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇకనైనా మొద్దునిద్ర వీడాలి.. గ్రామాల్లో సమస్యల పంచాయతీని తీర్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర సచివాలయంలోనే కాదు.. చివరికి..
— KTR (@KTRBRS) February 6, 2025
గ్రామ సచివాలయాల్లో కూడా పాలన పడకేసింది..
గాడితప్పిన పంచాయతీల్లో పరిపాలన సాగేదెట్లా..? సమస్యల సుడిగుండంలో ఉన్న ప్రజల కష్టాలు తీరేదెట్లా..??
పడకేసిన పారిశుధ్యంతో ప్రజలు రోగాలపాలు
వీధి దీపాలు వెలగక పల్లెసీమల్లో చిమ్మ చీకట్లు
దెబ్బతిన్న… pic.twitter.com/d1ILtaW1ao
KTR's criticism of Revanth Reddy's government






