KTR: కేసీఆర్ చావు కోరుకునే రాబందు రేవంత్: కేటీఆర్

by Prasad Jukanti |   (  Updated:2026-01-04 06:01:09  IST  )

సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్‍పై చేసిన విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

KTR: కేసీఆర్ చావు కోరుకునే రాబందు రేవంత్: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నదీ జలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా ద్రోహం చేస్తూనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో మాజీ మంత్రి హరీశ్ రావు పీపీటీ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‍పై (KCR) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు చెప్తారని.. రేవంత్ రెడ్డి అధికార మదంతో మిడిసిపడుతూ వాగుతున్నారని దుయ్యబట్టారు. ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణను సాధించారని అలాంటి కేసీఆర్ చావును పదే పదే కోరుకునే రాబందు రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యవాదుల సంచులు మోసిన అల్పుడి చేతిలో నేడు తెలంగాణ ఉన్నందుకు మేం బాధపడుతున్నామన్నారు. రేవంత్ రెడ్డి ఒక భాషలోనే తిట్లోచ్చేమో, మాకు మూడు నాలుగు భాషల్లో తిట్లోచ్చన్నారు.

కరువు నేలల్లో సిరులు పండించి, మరణ మృదంగాలు మోగిన చోట జీవకళ తెచ్చిన మానవీయ పరిపాలకుడు కేసీఆర్ అని ఇవాళ అట్లాంటి కేసీఆర్ గురించి 'వినాశకాలే విపరీత బుద్ధి' అన్నట్టుగా రెచ్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‍ను ఉద్దేశించి మాట్లాడితే హృదయం రగిలిపోతుందన్నారు. కేసీఆర్, హరీశ్ రావును ఊరివేయాలని అని మాట్లాడుతున్నాడు ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీని ఎన్ని సార్లు ఊరివేయాలి? కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా ప్రజలు శిక్షించాలి? అని నిలదీశారు. అసెంబ్లీలో నదీ జలాల అని చెప్పి చర్చ పెట్టారు. అసలు ఈ ముఖ్యమంత్రికి బేసిన్లు తెలవదు, బేసిన్ అంతకంటే తెలవదని ఎద్దేవా చేశారు. దేవాదుల ఏ బేసిన్ లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడని సెటైర్ వేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సమైక్యవాదుల సంచులు మోస్తున్నప్పుడు, సమైక్యవాదుల బూట్లకు పాలిష్ చేస్తున్నప్పుడు తెలంగాణ కోసం కోట్లాడామన్నారు. ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్న అంగుష్ఠ మాత్రులు అనే పదానికి, ఆ మాటకి అర్హుడు ఎవడైనా ఉన్నాడంటే రేవంత్ రెడ్డిని అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులను తారక రామారావుఅన్నది కచ్చితంగా వారికి తగిన మాట అన్నారు.

Next Story