- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీ రామారావు.. కేసీఆర్ లాంటి వారే ఓడిపోయారు: కేటీఆర్
‘నేనే రాజు.. నేనే మంత్రి అనుకున్న వాళ్లని ఎంతో మందిని చూసినం. పిచ్చి తుగ్లక్‌లు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్లు వస్తారు, పోతారు. ఎవరూ పర్మనెంట్ కాదు. అలా అనుకున్న వాళ్లు చాలామంది అట్లాగే గాలికి కొట్టుకుపోయారు. ప్రజల చైతన్యాన్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే వారు చాలా తెలివితక్కువ వాళ్లే అవుతారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నేనే రాజు.. నేనే మంత్రి అనుకున్న వాళ్లని ఎంతో మందిని చూసినం. పిచ్చి తుగ్లక్‌లు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్లు వస్తారు, పోతారు. ఎవరూ పర్మనెంట్ కాదు. అలా అనుకున్న వాళ్లు చాలామంది అట్లాగే గాలికి కొట్టుకుపోయారు. ప్రజల చైతన్యాన్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే వారు చాలా తెలివితక్కువ వాళ్లే అవుతారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో ఇందిరా గాంధీ, ఎన్టీ రామారావు ఓడిపోయారని.. కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు సైతం కామారెడ్డిలో దురదృష్టవశాత్తూ ఓటమి పాలయ్యారని అన్నారు. కానీ దేశం అట్లే ఉందని.. ప్రజల చైతన్యం అట్లే ఉందని తెలిపారు.
ప్రజల మనసు గెలవడంలో కాంగ్రెస్ విఫలం
పార్టీకి మద్దతుగా, అండగా నిలబడ్డ వారందరికీ కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో సామదాన భేద దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేసినా వారు స్పష్టంగా ప్రజల మనసు గెలవడంలో విఫలం అయ్యారని అన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40 శాతం గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారన్నారు. 4,000 పైచిలుకు గ్రామాల్లో తమ సర్పంచులు గెలిచారన్నారు. మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా డెఫినెట్‌గా గతంలో ఎవరెవరైతే ఏదో మాట్లాడారో వారందరి నోళ్లు మూతలు పడే విధంగా మెరుగైన ఫలితాలే సాధించామని చెప్పారు. 2020లో నాడు మొత్తం 130 మేయర్లకు, చైర్ పర్సన్లకు మున్సిపల్ ఎన్నికలు జరిగాయని.. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్టుగా 122 గెలిస్తే మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు, కాంగ్రెస్ నాలుగు గెలిచిందని.. బీజేపీ రెండు, ఎంఐఎం రెండు గెలిచిందని చెప్పారు. ఇప్పుడు ప్రత్యక్షంగా తాము ఇప్పుడు 15కు పైన గెలిచామని చెప్పారు. దాంతోపాటు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సత్తాచాటినట్లు తెలిపారు. ఓవరాల్‌గా చూసుకుంటే 117లో డెఫినెట్‌గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే తాము భావిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ బేరాలు, బేరసారాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలయ్యాయని.. తమ దగ్గర గెలిచిన వాళ్లను లాక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారని.. అయినా కొట్లాడుదామని పిలుపునిచ్చారు.
సింగరేణిలో గెలిచాం..
సంతోషకరమైన విషయం ఏమిటంటే సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణం సీఎం బావమరిది కీలక పాత్రధారిగా, కింగ్ పిన్‌గా రూ.6,000 కోట్ల కుంభకోణాలు చేసిన అంశాన్ని తాము బయటపెట్టామని.. ఆ తర్వాత తమతోపాటు సీపీఐ కలిసి వచ్చి చెన్నూరు నియోజకవర్గంలో, క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రచారంలో పాల్గొన్నారని కేటీఆర్ తెలిపారు. దాంతో ఆ మున్సిపాలిటీ కూడా తాము గెలుచుకున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తుండడంతో వారిని నిరోధించడానికి సీపీఐని కలుపుకున్నామన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే, రాష్ట్ర సీపీఐ సెక్రెటరీ సాంబశివరావుతో తాను మాట్లాడానని.. కొత్తగూడెంలో వారికి మద్దతు ఇస్తామని చెప్పామని అన్నారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే డెఫినెట్‌గా తాము కలిసి వస్తామని చెప్పామని.. కాంగ్రెస్, బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నట్లు చెప్పారు. ‘సీపీఐ తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ తీసుకోండి. మేము మద్దతు ఇస్తాము ఓపెన్ గా అని చెప్పడం జరిగింది’ అని అన్నారు. ఇలా కలిసి వచ్చే లౌకిక పార్టీలతో కలిసిపోతామన్నారు.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీనే..
మంచి భవిష్యత్తు ఉంది అనడానికి, అట్లాగే ప్రధాన ప్రత్యామ్నాయం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అని.. కాంగ్రెస్‌తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్‌ను గద్దె దించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి బీఆర్ఎస్‌కు మాత్రమే ఉన్నదని కేటీఆర్ అన్నారు. మొన్న పల్లెల్లో జరిగిన ఎన్నికలు, ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయన్నారు. అలాగే పట్టణంలోనూ ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే అని.. పోరాడే సత్తా ఉన్న పార్టీ తమదని అన్నారు. ఈ రెండు పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రానికి బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రజలు తేల్చినట్టు అయిందన్నారు. ఇదే ఉత్సాహంతో రేపు హైదరాబాద్ కార్పొరేషన్, మిగతా కార్పొరేషన్లు వరంగల్, ఖమ్మం, అలాగే జిల్లా పరిషత్ ఎన్నికల్లో ముందుకు పోతామని వెల్లడించారు. రాష్ట్రంలో 124 చోట్ల ఎన్నికలు జరిగితే, 30 హంగ్ ఉన్నాయని.. తాము 15 గెలిచామని.. అంటే 46 పోతే మిగతావి వాళ్లు గెలిచారని అన్నారు. హంగ్ వచ్చిన చోట ఏ వైఖరి అవలంబించాలనేది పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌తో మాట్లాడుతామన్నారు. స్థానిక నాయకుల మనోభావాలు, అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయని బేరీజు వేసుకున్నాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే.. రేవంత్‌రెడ్డి మళ్లీ వచ్చి తాము గెలిచామని.. తమకు తిరుగు లేదని మళ్లీ ఫోజులు కొడతారని.. నిజంగా గవర్నమెంట్ మీద రేవంత్‌కు నమ్మకం ఉంటే ఆ పది మందితో రాజీనామా చేయించి ఎలక్షన్స్‌కు పోదామని సవాల్ విసిరారు. అధికార పార్టీ 80-90 శాతం గెలిస్తేనే గెలిచినట్టు అని.. లేకపోతే అది గెలుపే కాదని అన్నారు.






