కిషన్‌ రెడ్డితో రాజకీయ సంబంధాలు: KTR క్లారిటీ

by Gantepaka Srikanth |

కిషన్‌ రెడ్డితో రాజకీయ సంబంధాలు: KTR క్లారిటీ

కిషన్‌ రెడ్డితో రాజకీయ సంబంధాలు: KTR క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ దెబ్బకు రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు తిరిగి వెళ్లిపోతున్నాయని బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్(KTR) విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఓ కాలు కాంగ్రెస్‌లో.. మరో కాలు బీజేపీలో పెట్టి ప్రయాణం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉందో పంచాయతీ ఎన్నికల ఫలితాలే చెప్పాయని అన్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మా పాత మిత్రుడు అని.. ఆయన మమ్మల్ని కలిస్తే.. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వచ్చిన బాధ ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. కిషన్ రెడ్డితో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. రాజకీయంగా కలిసి నిర్ణయం తీసుకుంటున్నామని అంటున్నారు.. అసలు కిషన్ రెడ్డి మాకు ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ నేతలను కేటీఆర్ అడిగారు. కిషన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కిషన్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు.

Next Story