- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటండి : కేటీఆర్ పిలుపు
ఈనెల 17న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు(KCR Birthday) సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : ఈనెల 17న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు(KCR Birthday) సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక పిలుపునిచ్చారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'వృక్షార్చన'(Vruksharchana) పేరుతో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 'హరితహారం'(Harithaharam) ద్వారా తెలంగాణ భూతల్లికి ఆకుపచ్చని చీర చుట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్‌కు మనం ఇచ్చే పుట్టినరోజు కానుక అని అన్నారు. వృక్షార్చన కార్యక్రమాన్ని నడిపించేందుకు బాధ్యతలు తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ జె సంతోష్ కుమార్(J Santhosh Kumar)ను కేటీఆర్ అభినందించారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green India Challenge) చేస్తున్న ఈ వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హరితసేనలోని సభ్యులందరూ మొక్కలు నాటి అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. హరిత తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలు పోగులాగా వృక్షార్చన తాను కార్యక్రమాన్ని తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కేటీఆర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ఆఫీస్ సెక్రటరీ, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, బీగాల గణేష్, శంకర్ నాయక్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ సమక్షంలో విడుదల చేశారు.






