Mahesh Kumar Goud : కేటీఆర్ అహంకారం తగ్గలేదు : పీసీసీ చీఫ్

by Muthe.Rajitha |

తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు(Telangana Budget Assembly Sessions) నేడు ప్రారంభం అయ్యాయి.

Mahesh Kumar Goud : కేటీఆర్ అహంకారం తగ్గలేదు : పీసీసీ చీఫ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు(Telangana Budget Assembly Sessions) నేడు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(KTR) పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Cheif Mahesh Kumar Goud). గవర్నర్ ప్రసంగాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ కు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షనేతగా కేసీఆర్(KCR) అసెంబ్లీకి రావడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాలనకు సంబంధించి, ప్రజలకు ఉపయోగపడే సలహాలు ప్రభుత్వానికి సూచిస్తే తప్పక తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

అయితే నేడు ప్రారంభం అయిన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రంలో పాలన, రైతు భరోసా, రాష్ట్ర గీతం వంటి అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే గవర్నర్ ప్రసంగం అంతా అబద్దాలు, అర్థ సత్యాలు అని కేటీఆర్ ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగంలా ఉందని, సాక్షాత్తూ గవర్నర్ చేత కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెప్పించిందని మండిపడ్డారు.

Next Story