ఫిడే చెస్ ఉమెన్ వరల్డ్ కప్.. 'టేక్ ఏ బౌ' అన్న కేటీఆర్

by Muthe.Rajitha |

ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ 2025(FIDE Women's Chess World Cup) దివ్య దేశ్‌ముఖ్(Divya DeshMukh) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఫిడే చెస్ ఉమెన్ వరల్డ్ కప్.. టేక్ ఏ బౌ అన్న కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ 2025(FIDE Women's Chess World Cup) దివ్య దేశ్‌ముఖ్(Divya DeshMukh) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో మరో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి(Koneru Hampi)పై విజయం సాధించిన దివ్య, కొత్త రికార్డు సృష్టించింది. అయితే ఈ ఫైనల్ గేమ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హర్షం వ్యక్తం చేశారు. FIDE మహిళల ప్రపంచ కప్ కోసం ఈసారి ఇద్దరూ భారత మహిళలే ఉండటం మన దేశానికి గర్వకారణం అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ వేదికపై ప్రకాశింపజేసినందుకు విజేత దివ్య దేశ్‌ముఖ్, రన్నరప్ కోనేరు హంపి ఇద్దరికీ అభినందనలు అన్నారు. ఈ ఫైనల్ గేమ్ అద్భుతంగా ఉందన్న కేటీఆర్... 'టేక్ ఏ బౌ లేడీస్' అని కొనియాడారు. ఈ మేరకు కేటీఆర్ తాం ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేసారు.

Next Story