- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన అన్నదాతలు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. తెల్లవారుజామునే పీఏసీఎస్ (PACS) గోడౌన్ల ఎదుట బారులు తీరుతున్నారు. అయినా.. తమకు యూరియా (Urea) దొరుకుతుందో లేదోనని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే యూరియా బస్తాల కోసం అన్నదాతలు పడుతోన్న కష్టాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాంట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా లేదని.. రుణమాఫీ లేదని మండిపడ్డారు. కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూడా కరువొచ్చిందని ఆక్షేపించారు. ప్రభుత్వం అడిగినట్లుగానే ఆధార్ కార్డులు ఇచ్చినా, రైతుకి కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఎందుకుందో రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 266.50 ఉండాల్సిన బస్తా యూరియా ధర ఇప్పుడు రూ.325 ఎలా అయ్యిందో రైతులకే కాదు రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలియలని అన్నారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాను దగ్గరుండి నడిపిస్తుంది ఎవరని ధ్వజమెత్తారు. ఈ కృత్రిమ కొరత ఎవరి వల్ల ఏర్పడుతుందో, ఆఖరికి ఎరువులను కూడా బుక్కేస్తున్న మెతన్నలు ఎవరో వెంటనే విచారణ జరిపించాలి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






