- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి..? జాగో ఢిల్లీ జాగో: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్
రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. గురువారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేయకపోతే తనది భాధ్యత అని కామెంట్ చేశారు. తాజాగా సీఎం రేవంత్ కామెంట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ‘X’ (ట్విట్టర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తల్లికి బువ్వ పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా రేవంత్ తీరు ఉందని అన్నారు. తెలంగాణ (Telangana)లో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి.. ఢిల్లీ (Delhi) పుర వీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండని ఫైర్ అయ్యారు.
తెలంగాణ (Talangana)లో కొనసాగుతోన్న నికృష్ట పాలన.. ఢిల్లీ (Delhi)లో కూడా చేయిస్తానంటూ పులకేశి బయలుదేరాడిన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరికి ఉచిత కరెంటు (Free Power), గ్యాస్ సబ్సిడీ (Gas Subsidy) ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. నెలకు రూ.2,500, తులం బంగారం తీసుకుంటోన్న ఆడబిడ్డలు ఎక్కడ అని అన్నారు. రైతు భరోసా (Raithu Bharosa) రూ.7500 ఇచ్చింది, ఆసరా ఫించన్లు (Aasara Pensions) రూ.4 వేలు చేసిందెక్కడో చెప్పాలన్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు.. ఇక్కడ హామీలకు దిక్కు లేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా అని మండిపడ్డారు. ఢిల్లీ గల్లీల్లో కాదు.. దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్ నగర్ (Ashok Nagar) గల్లీల్లో యువతకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పాలని సవాల్ విసిరారు. నవ్విపోదురు గాక .. నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం.. జాగో ఢిల్లీ జాగో.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.






