KTR : గాంధీ భవన్ వెలవెల.. తెలంగాణభవన్ కళ కళ: నమ్మి నానబోస్తే.. షార్ట్‌ఫిల్మ్ ప్రదర్శనలో కేటీఆర్

by Ramesh Naini |

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నమ్మి నానబోస్తే.. షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు.

KTR : గాంధీ భవన్ వెలవెల.. తెలంగాణభవన్ కళ కళ: నమ్మి నానబోస్తే.. షార్ట్‌ఫిల్మ్ ప్రదర్శనలో కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ (Telangana Bhavan) తెలంగాణ భవన్‌లో శనివారం నమ్మి నానబోస్తే.. షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ఈ సందర్భంగా షార్ట్ ఫిల్మ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు తిలకించారు. అనంతరం (KTR) కేటీఆర్ మాట్లాడుతూ.. గాంధీభవన్ బోసిపోయిందని, తెలంగాణ భవన్ నిత్యం కళకళ లాడుతున్నదని అన్నారు. వచ్చే ఏప్రిల్ నెలతో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 25 ఏళ్ళు పూర్తి అవుతుందన్నారు. గత ఏడాది బీఆర్ఎస్ పార్టీకి అత్యంత గడ్డుకాలమని చెప్పారు. ఈ సంవత్సరం కాలంలో ఏం జరిగిందో షార్ట్ ఫిల్మ్ ద్వారా రసమయి బాలకిషన్ చూపించారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓడిపోయామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, ఎమ్మెల్సీ కవితను ఐదు నెలలు జైల్లో పెట్టారన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాలేదన్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఒక్కరు గెలవరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చిందని అన్నారు. లగచర్ల రైతు భాదితులను ఢీల్లి వరకు తీసుకువెళ్లామన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడాలని ఆశా వర్కర్లు కలిశారని వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలు లేవనెత్తుతామని, బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయిందని, బీఆర్ఎస్ పోరాడే తత్వాన్ని కోల్పోలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు అభిమానం తగ్గలేదన్నారు.

Next Story