- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ వి దొంగ దీక్షలు.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్‌వి దొంగ దీక్షలు అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూర్ : బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్‌వి దొంగ దీక్షలు అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. కాంగ్రెస్ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంటే ఓర్వలేకనే కేటీఆర్ ధర్నాల పేరుతో షో చేస్తున్నాడని విమర్శించారు. బుధవారం గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులతోపాటు రైతు కూలీలకు సైతం ప్రభుత్వం సాయం అందిస్తేంటే కేటీఆర్జీర్ణించుకోలేకపోతున్నాడని విమర్శించారు. ‘‘గతంలో కేసీఆర్ప్రతి రైతుకు యూరియా ఫ్రిగా ఇస్తానని.. ఇయ్యాలే ఆయమీదేందుకు ధర్నా చేయలేదని’’ కేటీఆర్‌ను ప్రశ్నించారు.
గతంలో బీఆర్ఎస్ రుణమాఫీ చేయకపోవడంతోనే కాంగ్రెస్ప్రభుత్వంపై భారం పడిందన్నారు. కేటీఆర్‌కు నల్లగొండ మంత్రులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ‘‘అయ్యా చాటుతో ఎమ్మెల్యే, మంత్రి అయ్యావు.. మామ పేరుతో అల్లుడు హరీష్మంత్రి అయ్యారు’’ అని ఐలయ్య దుయ్యబట్టారు. త్యాగాలు చేసిన ఉత్తమ్‌కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండకు పేరు తీసుకొచ్చారని, బంగారుకొండగా ఇటీవల ఉదయ సముద్రాన్ని ప్రారంభించుకున్నామన్నారు. రైతుల నుంచి ఆధరణను చూసి ఓర్వలేక కచర కేటీఆర్..మళ్లీ కచర వేశాలతో రైతులను పక్కదొవ పట్టించేందుకు ముసలీ కన్నీరు కారుస్తున్నాడని ఆరోపించారు.






