సౌదీ అరేబియా బస్సు ప్రమాద మృతుల కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

by Malleboina Mahesh |

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది భారతీయులు చనిపోగా.. వారిలో 18 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు, ప్రాణాలు కోల్పోయారు.

సౌదీ అరేబియా బస్సు ప్రమాద మృతుల కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది భారతీయులు చనిపోగా.. వారిలో 18 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు, ప్రాణాలు కోల్పోయారు. వారంతా హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఉదయం సౌదీ అరేబియా లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. విద్యానగర్‌లోని నసీరుద్దీన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.

సౌదీ దుర్ఘటనలో నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది మరణించడం అత్యంత బాధాకరంగా ఉందని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ ఈ సంఘటనను తీవ్రంగా భావిస్తున్నట్లు, మృతుల కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్శనలో వారు కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఎటువంటి ఆర్థిక, సామాజిక సహాయం అవసరమైన పార్టీ ద్వారా అందజేస్తామని స్పష్టం చేశారు. అలాగే కుటుంబ సభ్యులతో సౌదీకి వెళ్లిన బీఆర్ఎస్ బృందం.. అక్కడ వారికి అవసరమైన సహాయం చేస్తుందని ఈ మేరకు కేటీఆర్ స్పష్టం చేశారు.

Next Story