భూదాన్ భూ బాధితులకు కేటీఆర్ భరోసా

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-26 10:00:31  IST  )

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా భూదాన్ భూ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

భూదాన్ భూ బాధితులకు కేటీఆర్ భరోసా
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పర్యటించారు. ఈ సందర్భంగా భూదాన్ భూ బాధితుల(Bhoodan Land Victims)ను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి ఫైట్ చేద్దామని పిలుపునిచ్చారు. బాధితులు వారికి జరిగిన అన్యాయాన్ని కేటీఆర్‌కు వివరించారు. వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నంబర్లలో 60 ఎకరాల భూదాన్‌ భూమి ఉండాల్సి ఉండగా.. తాము గుడిసెలు నిర్మించుకున్నది కేవలం 30 ఎకరాల్లోనే అని అధికారులు చెప్తున్నారని, మరి మిగిలిన 30 ఎకరాలు ఏమయ్యాయో అడగాలని బాధితులు కేటీఆర్‌ను కోరారు. కాగా, దశాబ్దం క్రితం ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం నగరానికి వచ్చి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడమే మేము చేసిన పాపమైందా? భూదాన్‌ భూముల్లో నివాసముంటున్న పేదలపై పెద్దలకు ఎందుకింత కంటగింపు అని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. దీనిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది.

Next Story