- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దర్శకుడు ఎన్.శంకర్ నివాసానికి కేటీఆర్.. మాతృమూర్తి మృతికి సంతాపం
తెలంగాణ ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ మాతృమూర్తి నిమ్మల సక్కుబాయమ్మ ఇటీవల వృద్ధాప్య సమస్యలతో కన్నుమూసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ (N Shankar) మాతృమూర్తి నిమ్మల సక్కుబాయమ్మ (78) ఇటీవల వృద్ధాప్య సమస్యలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని శంకర్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ సుక్కుబాయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం శంకర్ తన తల్లిని కోల్పోవడం ఎవరూ పూడ్చలేని లోటని, ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి భగవంతుడు కొండంత ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.
డైరెక్టర్, తెలంగాణ ఉద్యకారుడు శంకర్‌తో కేటీఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే స్వయంగా ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కాగా, నల్గొండ జిల్లాకు చెందిన ఎన్. శంకర్ ఎన్‌కౌంటర్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అనంతరం శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం, జై బోలో తెలంగాణ వంటి హిట్ చిత్రలను నిర్మించి తెలుగు సినీ పరిశ్రమల్లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.






