KTR: ఇదొక "చెత్త" సర్కారు! పట్టణాలు కంపుకొడుతుంటే..? కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2025-08-18 05:51:58  IST  )

ఇదొక "చెత్త" సర్కారు.. అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

KTR: ఇదొక చెత్త సర్కారు! పట్టణాలు కంపుకొడుతుంటే..? కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇదొక "చెత్త" సర్కారు.. అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ (KTR) రాష్ట్ర ప్రభుత్వంపై (Congress government) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రోడ్లపై (Garbage) చెత్త పేరుకుపోయిన ఫోటోలను జోడిస్తూ ఆసక్తికర పోస్ట్ చేశారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ (Municipal Department), ఆరోగ్య (Health Department) శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయని తెలిపారు. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్‌ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమీక్షా, సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవని గుర్తుకుచేశారు. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రజలు ఈసురోమని అలమటిస్తుంటే, పాలకులు మాత్రం "ఆర్ఆర్ ట్యాక్స్" వసూళ్లలో బిజీగా ఉన్నారని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Next Story