- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అసలు మీరేం చేస్తున్నారు’?.. కల్తీ కల్లు ఘటనపై కేటీఆర్ ట్వీట్
కూకట్‌పల్లి(Kukatpally) కల్తీ కల్లు(Kalthi Kallu) ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. మొత్తం 37 మంది అస్వస్థతకు గురయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: కూకట్‌పల్లి(Kukatpally) కల్తీ కల్లు(Kalthi Kallu) ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. మొత్తం 37 మంది అస్వస్థతకు గురయ్యారు. నిమ్స్ ఆసుపత్రిలో 31 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నలుగురికి డయాలసిస్ చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
‘‘హైదరాబాద్‌లో కల్తీ కల్లు బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలను వెంటనే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలి. ఒక్కొక్క కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం అందించాలి. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలి. మెరుగైన చికిత్స అందించాలి. కుటుంబం కోసం కాయకష్టం చేసే కష్టజీవులు కల్తీ కల్లు బారిన పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతమంది చనిపోతే ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోకాపోవడం చాలా దారుణం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలి’’ అని ఎక్స్ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు.






