KTR: రేవంత్ @ 50.. సీఎం హస్తిన టూర్‌పై కేటీఆర్ ఎక్స్ ద్వారా సెటైర్లు

by Ramesh Naini |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పాలన గాలికొదిలేసి ఢిల్లీ బాటపడుతున్నారని.. ఢిల్లీ బాస్‌లను కలిసేందుకు క్యూ కడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

KTR: రేవంత్ @ 50.. సీఎం హస్తిన టూర్‌పై కేటీఆర్ ఎక్స్ ద్వారా సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర పాలన గాలికొదిలేసి (Delhi tour) ఢిల్లీ బాటపడుతున్నారని.. ఢిల్లీ బాస్‌లను కలిసేందుకు క్యూ కడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించి ఆయన శనివారం ట్వీట్ చేశారు. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ ఏఐసీసీ లా, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ ఆర్‌టీఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కాంక్లేవ్‌లో పాల్గొననున్నారు. ఇది ఆయనకు 50వ ఢిల్లీ పర్యటన కావడం విశేషం.

కాగా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50... ఇవి కేవలం సంఖ్యలు కావు, ముఖ్యమంత్రి ఢిల్లీకి చేసిన నిరంతర ప్రయాణానికి సంబంధించిన చరిత్ర. ఇది ఏ గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది? రేవంత్ తన 50వ విమాన (ఢిల్లీ) సందర్శనను 20 నెలల్లోనే పూర్తి చేశాడు. ఇదేదో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి కాదు, వాటిని వేలం వేయడానికి అని ఎద్దేవా చేశారు.

ప్రతి యాత్రను ద్రోహం, వెన్నుపోటు కోసమే చేయడం జరిగిందని కేటీఆర్ మండిపడ్డారు. హస్తిన పర్యటనల ద్వారా తెలంగాణకు లాభం గుండు సున్నా అయితే తన గురువుకు నీటి హక్కులు బహుమతిగా ఇచ్చారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ ఢిల్లీ బాస్‌లకు కోట్లు ప్రతిజ్ఞ చేశారని ఆరోపించారు. కష్టపడి సంపాదించిన తెలంగాణ సంపద పట్టపగలు దొంగిలించబడిందన్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు చూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

Next Story