హరీష్ రావుకు మద్దతుగా కేటీఆర్ ట్వీట్.. డైనమిక్ లీడర్ అంటూ..

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-01 15:06:38  IST  )

బీఆర్ఎస్‌(BRS)లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

హరీష్ రావుకు మద్దతుగా కేటీఆర్ ట్వీట్.. డైనమిక్ లీడర్ అంటూ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‌(BRS)లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హరీష్ రావు(Harish Rao)పై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేసిన వేళ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. హరీష్ రావుకు మద్దతుగా ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. హరీష్ రావును డైనమిక్ లీడర్ అంటూ కొనియాడారు. అంతేకాదు.. ఇది ఆరడుగుల బుల్లెట్టు. సింహం సింగిల్‌గానే వస్తుంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా ఆధారాలతో సహా తిప్పికొట్టారు అంటూ బీఆర్ఎస్ అధికారిక ఖాతా ద్వారా పోస్టు చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. దీంతో అసలు బీఆర్ఎస్‌లో ఏం జరుగుతుందో తెలియక పార్టీ శ్రేణులు సతమతమవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి కవితను తీసేశారు. కవిత పీఆర్‌వో టీమ్, జాగృతి సంస్థ సభ్యులను వాట్సాప్ నుంచి తొలగించారు. అంతేకాకుండా కవితకు సంబంధించిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అన్‌ఫాలో అవుతున్నారు.





Next Story