- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: కేసీఆర్ తెలంగాణ విజన్ వల్లే.. గత పదేళ్ల స్వర్ణయుగం: ఎక్స్‌లో కేటీఆర్ ఆసక్తికర పోస్ట్
గణాంకాలు, నివేదికలు, డేటా అన్నీ ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని, గత పది సంవత్సరాలు తెలంగాణకు స్వర్ణయుగంగా నిలిచాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గణాంకాలు, నివేదికలు, డేటా అన్నీ ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని, గత పది సంవత్సరాలు (Telangana Decade) తెలంగాణకు స్వర్ణయుగంగా నిలిచాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా తెలంగాణ ఆదాయంపై ఆసక్తికర ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో సమగ్ర, సమన్విత, సమతుల్య అభివృద్ధి మోడల్ ద్వారా తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ లేని మార్పును సాధించిందని తెలిపారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు (per-capita income) ఆదాయం రూ.1 లక్ష లోపే ఉండేదని తెలిపారు. 2024-25 నాటికి ఆ సంఖ్య రూ.3.87 లక్షలకు పెరిగిందని, ఇది దేశంలోనే అత్యధికమని వెల్లడించారు.
ఈ అపూర్వ విజయానికి కారణం మాజీ సీఎం కేసీఆర్ (KCR) దూరదృష్టి అభివృద్ధి మోడల్ అని కొనియాడారు. ప్రతి వర్గానికీ మద్దతుగా పలు సంక్షేమ పథకాలు, భారీ స్థాయిలో మౌలిక వసతుల నిర్మాణం, చారిత్రాత్మక నీటిపారుదల ప్రాజెక్టులు, రైతు కేంద్రిత పథకాలు, పరిశ్రమల వృద్ధికి అనుకూల వ్యాపార విధానాలు, ఐటీ & సేవల రంగంలో విస్తరణ, నిరంతర సుభిక్షత.. అని వివరించారు. కేసీఆర్ విజన్ తెలంగాణకు అసమానమని, ఆయన అంకితభావం తెలంగాణ కోసం అచంచలమైనదని ట్వీట్‌లో పేర్కొన్నారు.






