ధ‌న్వాడ‌ రైతుల చేతుల‌కు సంకెళ్లు వేయ‌డం దుర్మార్గం: కేటీఆర్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-18 11:04:25  IST  )

ధ‌న్వాడలో ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీకి వ్య‌తిరేకంగా పోరాడిన రైతుల చేతికి సీఎం రేవంత్ బేడీలు వేయ‌డం అత్యంత దుర్మార్గమైన చ‌ర్య అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

ధ‌న్వాడ‌ రైతుల చేతుల‌కు సంకెళ్లు వేయ‌డం దుర్మార్గం: కేటీఆర్
X

దిశ‌, వెబ్ డెస్క్: ధ‌న్వాడలో ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీకి వ్య‌తిరేకంగా పోరాడిన రైతుల చేతికి సీఎం రేవంత్ బేడీలు వేయ‌డం అత్యంత దుర్మార్గమైన చ‌ర్య అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న ఎక్స్ వేధిక‌గా స్పందించారు. అలంపూర్ కోర్టు వ‌ద్ద అన్న‌దాత‌ల‌కు పోలీసులు సంకెళ్లు వేసిన సీఎం రాక్ష‌స మ‌న‌స్త‌త్వానికి ప‌రాకాష్ట అంటూ మండిప‌డ్డారు.

పెద్ద ధ‌న్వాడ‌లో గ‌త కొన్ని నెల‌లుగా ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీకి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న అనేక గ్రామాల ప్ర‌జ‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టి వేధించ‌డ‌మే దారుణ‌మైతే, చివ‌రికి దొంగ‌లు, నేర‌స్తుల లాగా బేడీలు వేయ‌డం క్ష‌మించ‌రాని నేరం అన్నారు. గ‌తంలో ల‌గ‌చ‌ర్ల‌లో అల్లుడి ఫార్మా కంపెనీని అడ్డుకున్నార‌నే కోపంతో గుండెపోటు వ‌చ్చిన రైతుపై క‌నిక‌రం లేకుండా బేడీలు వేసి సీఎం మ‌హా పాపాన్ని మూటగ‌ట్టుకున్నార‌ని తెలిపారు. పెద్ద ధ‌న్వాడ విష‌యంలో ఇంత నిరంకుశంగా వ్య‌వ‌హ‌రిస్తున్న రేవంత్ రెడ్డికి అన్న‌దాత‌ల చేతిలో గుణ‌పాఠం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. సీఎం క‌నుస‌న్న‌ల్లోనే ఇదంతా జ‌రుగుతుంది కాబ‌ట్టి వెంట‌నే రైతులంద‌రికీ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Read More... Harish Rao : రైతుల చేతులకు సంకెళ్ళు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం : హరీష్ రావు

Next Story