తెలంగాణలో భారీ కుంభకోణం.. ముఖ్యనేత అనుచరుడి కనుసన్నల్లో దందా: కేటీఆర్ సంచలన ట్వీట్

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో భారీ కుంభకోణం.. ముఖ్యనేత అనుచరుడి కనుసన్నల్లో దందా: కేటీఆర్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘నగరంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (TDR) జారీలో కుంభకోణం జరుగుతోంది అని నేను వెల్లడించి ఆరు నెలలు దాటింది. ఇప్పుడది తీవ్ర రూపం దాల్చి వేలకోట్ల భారీ కుంభకోణం అయ్యింది. రాష్ట్రంలో ముఖ్యనేత అనుచరుడి కనుసన్నల్లోనే టీడీఆర్‌ల బ్లాక్ దందా కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీలో కొత్త టీడీఆర్‌ల జారీ నిలిపివేసి, కృత్రిమ కొరత సృష్టించి కాంగ్రెస్ గద్దలు వేల కోట్లు దండుకుంటున్నారు. అసలే డిమాండ్ లేక మూలుగుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ నేతలు తమ అవినీతితో ఉన్న ఊపిరి తీస్తున్నారు’’ అని కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. ట్వీట్

Next Story