- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ పాలిటిక్స్‌లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పాలిటిక్స్ హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రభుత్వంపై సోషల్ మీడియాను ఓ బలమైన అస్త్రంగా వాడుకుంటున్న కేటీఆర్ (KTR) తాజాగా అక్కడే విమర్శల పాలవుతున్నారు. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోద్దామనే ప్రయత్నంలో భాగంగా ఆయన పోస్టు చేసిన ఓ వీడియో చివరకు బూమరాంగ్ కావడంతో ట్వీట్‌ను డిలీట్ చేసుకున్నారు. దీంతో ‘కేటీఆర్ గారు ఇదేం తీరు’ అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇరుకున పెడదామని..
కాంగ్రెస్ సర్కార్‌ను ఎండగడుదామనే ప్రయత్నంలో ఖమ్మం జిల్లా నామవరం మిర్చి రైతు (Mirchi Rythu) చింతిర్యాల కోటేశ్వర్‌రావు మిర్చి మార్కెట్ యార్డులో ఆవేదన చెందుతున్న వీడియో క్లిప్‌ను కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ‘గుండెలు బాదుకుంటున్న ఈ రైతు గోస.. మనసులేని ముఖ్యమంత్రికి వినిపించడం లేదా? కనికరం లేని కాంగ్రెస్ సర్కార్‌కు కనిపించడం లేదా? మాయమాటలు నమ్మిన పాపానికి.. మిర్చి రైతు కంట్లో కారం కొడతారా? ఇద్దరు ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా? ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా?’ అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే పోస్టు చేసిన వీడియో పాతదని తేలింది. 2018లో కేసీఆర్ ప్రభుత్వంలో (KCR Govt) తమకు మద్దతు ధర లభించడం లేదని మరో రైతు చెబుతున్న వాయిస్ పూర్తి వీడియోలో ఉంది. దీంతో ఈ రైతు గోసను తమకు అనుకూలంగా మలుచుకుని కాంగ్రెస్ సర్కార్‌పై అస్త్రంగా వాడుకుందామనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. దీంతో విషయం గ్రహించిన కేటీఆర్ వెంటనే తాను షేర్ చేసిన వీడియోను డిలీట్ చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
అధికారపక్షానికి ఆయుధం..
అధికారం కోల్పోయిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలకు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా ఎటాక్ చేస్తున్నారు. అయితే వాటిని అధికారపక్షం తప్పుడు ప్రచారాలు అంటూ రివర్స్ కౌంటర్లు వేస్తూ వస్తోంది. తాజాగా ఖమ్మం మిర్చి రైతు విషయంలోనూ కేటీఆర్ తీరు సెల్ఫ్‌గోల్‌గా మారడంతో సోషల్ మీడియాలో అబద్ధాల ప్రచారం విషయంలో బీఆర్ఎస్‌పై తాము చేస్తున్న ఆరోపణలు నిజమే అనడానికి ఇదే నిదర్శనం అని కాంగ్రెస్ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. గతంలోనూ రేవంత్‌రెడ్డి సర్కార్‌పై విమర్శలు పోయి కేటీఆర్ బూమరాంగ్ అయ్యారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.






