- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవంబర్ 10న కొలంబోకు కేటీఆర్.. అసలు విషయం ఇదే!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నవంబర్ 10న శ్రీలంకకు వెళ్లనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నవంబర్ 10న శ్రీలంకకు వెళ్లనున్నారు. కొలంబోలో నిర్వహించే ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్-2025’ (Global Economic and Technology Summit-2025) సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ మేరకు సదస్సులో పాల్గొనాలని శ్రీలంక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరఫున, గెట్స్ శ్రీలంక డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏయుఎల్ఏ హిల్మీ (Dr. AULA Hilmi) నుంచి ఇటీవలే కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. నవంబర్ 10 నుంచి 12 వరకు కొలంబో (Colombo)లోని ‘ది కింగ్స్‌బరీ హోటల్’లో జరిగే సదస్సులో కేటీఆర్‌ను హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సదస్సులో ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నాయకులను ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్-2025’ సదస్సులో పాల్గొనబోతున్నారు.
READ MORE ...
రాష్ట్రంలో పోలీసులు ఏం పీకుతున్నారు..? మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు






